Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- గోవిందరావుపేట
అకాల వర్షాలతో జలమయమైన రోడ్లను బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్బంగా పసర నుంచి మేడారానికి వెళ్లే రహాదారిని, స్థానిక పార్టీ కార్యాలయం ఎదుట నున్న నీళ్లు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని రోడ్లు నీళ్లతో నిండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పొదిలి చిట్టి బాబు, సోమ మల్లారెడ్డి, సంజీవ, వ్యాపారస్తులులు గణేష్ రాజేశ్వరి, సుమన్, అభిలాష్, రమేషు, బాబు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.