Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఈ శ్రీకాంత్ తెలిపారు. అనధికార విద్యుత్ వాడకం నేరామని, రెండు పర్యాయలు విజిలెన్స్ దాడుల్లో దొరికితే నాన్ బెయిలబ్లు కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. బుధవారం సంగెం సెక్షన్ పరిధిలోని మొండ్రాయి, నార్లవాయి గ్రామాల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100యూనిట్ల వరకు ఉచితంగా అందించే విద్యుత్‌ను వినియోగించుకోవాలన్నారు. అందువలన మీటర్లు లేని వారూ వాటి కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మొండ్రాయి సర్పంచ్ గూడ కుమారస్వామి, నార్లావాయి సర్పంచ్ కద్దూరి రజిత రమేష్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు, సబ్ ఇంజనీర్ క్రాంతి కుమార్, ఎస్ఎల్ ఐ కుమారస్వామి, లెన్మెన్ రవి, జేఎల్ఎం కాశిరామ్, సీఎల్‌లు కోమురెల్లి, సుమన్ పాల్గొన్నారు.