Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కమ్మపెల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. నర్సంపేట స్కై రాకర్స్కు, భాంజీపేట జట్ల నడుమ జరిగిన ఫైనల్ల్లో నర్సంపేట రాకర్స్ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ప్రథమ బహుమతి గెలుచుకున్న జట్టుకు అను కన్సల్టెంట్ మోతె రంజత్ కుమార్ ట్రోఫీ, రూ.8,016 నగదు బహుమతిని అందజేశారు. ద్వితీయ బహుమతి, మ్యాన్ఆఫ్ది మ్యాచ్ కింద కీర్తిశేషులు రావిసందీప్ కుమార్ జ్ఞాపకార్థంగా యువజ మొబైల్స్ యజమాని రావి సౌజన్య రూ.3,016 నగదు బహుమతిని దాతగా సర్పంచ్ గుబెల్లి రంగారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొమ్ముక రవి, సునిల్, క్రాంతి కుమార్, ప్రశాంత్, రాజు, విజరు, అభినరు, అమర్, ఇంచు మిన్ను, శ్రీకాంత్, రవికుమార్ తదితర క్రికెట్ క్రీడకారులు పాల్గొన్నారు.