Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వడుప్సా, ట్రస్మా ప్రతినిధులు
నవతెలంగాణ-కాశిబుగ్గ
కోవిడ్ కారణంగా మూసేసిన పాఠశాలను వెంటనే తెరవాలని వడుప్సా, ట్రస్మా ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం తిలక్‌రోడ్డులోని స్కాలర్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడుప్సా వరంగల్ జోన్ అధ్యక్షుడు బిల్లా రవి, ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కొమ్మినేని భూపాల్ రావులు మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దష్ట్యా పాఠశాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడిపించాలన్నారు. బార్, సినిమాహాల్స్, ఫంక్షన్స్ హాల్స్‌కు లేని కరోనా నిబంధనలు కేవలం పాఠశాలలకు మాత్రమే ఎందుకని వారు ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయం కార్పొరేట్ పాఠశాలలకు మేలు చేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బడ్జెట్ ప్రయివేట్ పాఠశాలలపై ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతోందన్నారు. బడ్జెట్ పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లెర్నింగ్ లాస్ వలన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా వెనకబడి విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కొడిమెల రవి, ముక్కెర రవీందర్, సతీష్ మూర్తి, కూచన క్రాంతి కుమార్, జన్ను విలియమ్స్, సుధీర్, శ్రీనివాస్, సుధాకర్, వెంకట్ రాజం, మోహన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.