Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మల్లారెడ్డిపల్లి, అర్వపల్లి, సిద్దాపూర్, వంగపహాడ్ గ్రామాలకు చెందిన 26 మంది లబ్దిదారులకు ఇంటింటా తిరుగుతూ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సీఎం సహకారంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీతరాజు, జెడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు జనగాం ధనలక్ష్మీకిరణ్, కుందూరు సాంబరెడ్డి, తగరం జెన్నయ్య, డివిజన్ అధ్యక్షులు జంగ కుమార్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ మేరుగు రాజేష్‌గౌడ్ పాల్గొన్నారు.