Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలి
మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వచ్చిన రాష్ట్ర మంత్రుల పర్యటనలో రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నిరూపించుకున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. వడగండ్ల వర్షాని కి దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ రాకుండా తన ఫాంహౌజ్‌లోని తోటలను చూడడానికే సమయం సరిపోదనే రీతిలో మంత్రులను హెలికాప్టర్లో పంపించ డం విడ్డూరంగా ఉందన్నారు. పంటలపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికే మంత్రులను సీఎం పంపించి ఉంటారని రైతులు ఆశపడ్డారన్నారు. కానీ తీరా చూస్తే కంటితుడుపు చర్యగా ఓదార్చడానికే వచ్చారని నిరూపితమైందని విమర్శించారు. మంత్రులు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని, చివరకు వారి పర్యటన పిక్నిక్ స్పాట్‌కు వచ్చినట్లు సాగిందని ఎద్దేవాజేశారు. మంత్రుల పర్యటతో రైతులకు ఒరిగిందేమిటో చెప్పాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 53వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని, సాలినా రూ.40 నుంచి 50వేల వరకు రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే బీజేపీ రైతులకు అండగా పోరాడుతుందని హెచ్చరించారు.