Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం
పని తీరు మార్చుకోకుంటే వేటు..
అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-శాయంపేట
పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పల్లె ప్రకతి వనాలలో రంగు రంగుల పూల మొక్కలు కాకుండా గ్రామస్తులకు ఆక్సిజన్ అందించే మంచి మొక్కలు నాటాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అధికారులకు సూచించారు. మండలంలోని నేరేడుపల్లి, ప్రగతి సింగారం, వసంతపూర్ గ్రామాలల్లోని పల్లె ప్రగతి పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రగతి సింగారంలో రోడ్లపై ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తాచెదారం కనిపించడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పైన ఇలా ఉంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. శ్మశాన వాటిక చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ వేయాలని సూచించారు. గ్రామంలో స్వచ్ఛ భారత్ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్తులను, డ్వాక్రా గ్రూపు మహిళలను భాగస్వాములను చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, దీంతో వ్యాధులు సోకకుండా ఉంటాయని తెలిపారు. డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్త వేరు చేసి కంపోస్టు ఎరువు తయారు చేసి విక్రయించాలని సూచించారు.
ప్రగతి సింగారంలో మెయింటెన్స్ బాగాలేదని పంచాయతీ కార్యదర్శి కిరణ్‌పై అసంతప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మరలా వస్తానని, పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో కూలీలు పనికి వచ్చేలా చైతన్యం చేయాలని ఏపీవో అనితను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలలో ఈజీఎస్‌లో కూలీలతో పనులు చేయించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ, పల్లె పకతి వనాలలో చెట్లు వాడిపోకుండా నీళ్లు పట్టించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, తహశీల్దార్ హరికష్ణ, ఆర్ఐ హేమా నాయక్, ఏపీఓ అనిత, ఎంపీఓ రంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రైతు బీమా ఇప్పించాలని వేడుకోలు
తన భార్య నర్సిభాయి ఇటీవల మరణించిందని, ఆధార్ కార్డులో వయస్సు 70ఏండ్లు పడడంతో వ్యవసాయ అధికారులు రైతు బీమా రాదని చెబుతున్నారని, తన భార్య వయస్సు 60 సంవత్సరాల లోపు ఉంటుందని, తనకు రైతు బీమా అందించి ఆదుకోవాలని రైతు సూర వెంకటయ్య అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి కాళ్ళపై పడి వేడుకున్నారు. దీంతో స్పందించిన ఆమె వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతు బీమా ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.