Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అడిషనల్ డీఆర్డీఓ వసుమతి సూచించారు. ఎంపీపీ సమావేశ మందిరంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పనులకు ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 60మంది పనులకు వచ్చేలా చూడాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ మాట్లాడారు. నర్సరీ నిర్వహణ బాగుండాలని సూచించారు. ప్రతిబ్యాగులో మొక్క ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీఓ పాక శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా రోజు, రోజుకు విజంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.