Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీపీఓ ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ - ఖానాపురం
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డీపీఓ నాగపురి స్వరూప ఆదేశించారు. బుధవారం ఆమె ఖానాపూర్ పంచాయతీని ఆకస్మీకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె జనన, మరణ రికార్డులు, ఆస్థి మార్పిడి, గ్రామ సభలు తదితర కార్యక్రమాలు ఆప్డేట్ ఉన్నాయో, లేవోనని పరిశీలించారు. పంచాయతీ ఆదాయ, వ్యయాల రిజిస్టర్లను పరిశీలించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శి సట్ల సుప్రజని అభినందించారు. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ నర్సరీలో మొక్కలు పెంచే విధానాన్ని పరిశీలించి, నర్సరీకి సంబంధించిన పూర్తి బాధ్యత గ్రామపంచాయతీదేనని గుర్తు చేశారు. ఇంటి, కుళాయి పన్నులు వందశాతం వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి పంచాయతీ కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పర్వీన్ కైసర్, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ రాములు, బిల్ కలెక్టర్ ప్రసాద్, రవిబాబు, షఫీ, కంప్యూటర్ ఆపరేటర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.