Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వర్ధన్నపేట
బుధవారం పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై కమీషనర్ గొడిశాల రవీందర్, ఎస్ఐ రామారావు, వైస్ చైర్మన్ ఎలెందర్ రెడ్డిలతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ అంగోతు అరుణ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులకు ఆటంకం కలగకుండా ప్రజలు, వాహనదారులు సహకరించాలని కోరారు. వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురి కాకుండా అభివద్ధి పనులు జరుగుతున్న ఏరియాలలో ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను గమనిస్తూ, తమ గమ్యస్థానాలకు చేరే విధంగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సమ్మెట సుధీర్, తోట కూరి రాజమణి, మంచాల రామకష్ణ, తుమ్మల రవీందర్, కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజిమ్ అబ్దుల్, నాయకులు అంగోతు భిక్షపతి, కొండేటి సత్యం, బానోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.