Authorization
Wed March 12, 2025 09:56:07 am
నవతెలంగాణ-ములుగు
మారుమూల ప్రాంతాల ప్రజలకు పోస్టల్ సేవలు అందించేందుకు నూతనంగా బ్రాంచ్ పోస్టాఫీసులను ప్రారంభిస్తున్నట్టు ములుగు సబ్ డివిజన్ ఐపీఓ రామ్మూర్తి తెలిపారు. పోట్లాపూర్ గ్రామంలో సర్పంచ్ కుమ్మిత లత అంకిరెడ్డితో కలిసి ఆయన బుధవారం నూతన పోస్టాఫీసును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పోస్ట్ ఆఫీసు ఏర్పాట్లుకు సహకరించిన అధికారులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ ఇన్చార్జి జూకంటి అనూష, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.