Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కదం తొక్కాలని మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల పోషయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉన్నత విద్యావంతుడు నేతాజీ డాక్టర్ పిడమర్తి రవి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎస్సీలలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 12శాతం రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ మాదిగ జేఏసీని స్థాపించి ఉద్యమిస్తున్నారన్నారు.
ఎస్సీలలో ఎవరి కులం జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా దక్కాలనే నినాదంతో ఉద్యమిస్తున్నాడని పేర్కొన్నారు. ఒక కులం మరో కులాన్ని నిందించకుండా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అందుకు నిదర్శనం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినా ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్లు కులాల వారీగా జనాభా ప్రాతిపదికన విభజించే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ పార్లమెంట్ లో చట్టం చేయక పోవడమేనన్నారు. రాష్ట్రంలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మాదిగ జేఏసీ బలోపేతానికి మాదిగ యువత ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా ఎంపెళ్లి చందర్ రాపు, ప్రధానకార్యదర్శిగా కదురు మల్లేష్, ప్రచార కార్యదర్శిగా గద్దల రమేష్, కోశాధికారిగా ఎల్ చిన్న శ్రీను, ఉపాధ్యక్షులుగా గుగ్గిల్ల నరసింహ రావు, వెంపెళ్ళి సతీష్, బందెల రాము, ఎంపెల్లి అనిల్, ఎల్రాములు తదితరులను ఎన్నుకున్నారు.