Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలంలోని గణేష్పల్లి గ్రామంలో బాల వికాస అద్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను జెడ్పీటీసీ జోరిక సదయ్య, సర్పంచ్ తిప్పారపు యుగేందర్, ప్లాంట్ దాత రాజనారాయణ బుధవారం ప్రారం భించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి అవసరాల కోసం బాలవికాస వారు మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభి నందనీయమన్నారు. అనంతరం బాలవికాస సేవలను కొనియాడారు. చిన్న గ్రామపంచాయతీల్లో కూడా బాల వికాస వారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం బాలవికాస్ సిబ్బంది, రాజనారాయణను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుపతిరావు, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు దానబోయిన రాములు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.