Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.10లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
అ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మంపేట గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డారు. మండలానికి రూ.70 లక్షలు ఎమ్మెల్సీ మంజూరు చేశారని తెలిపారు. ఇందులో తిమ్మంపేట గ్రామానికి రూ.10 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. ఏడో విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా తిమ్మంపేట గ్రామంలో దళితవాడలో పల్లెనిద్ర చేసిన సందర్భంలో మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణానికి, సీసీ రోడ్లకు తన సీడీఎఫ్ నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. వాటికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఎనిమిది విడతలుగా రైతుబంధు ద్వారా సీఎం కేసీఆర్ రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు గుర్తు చేశారు. గుంట భూమి ఉన్నా, రైతు చనిపోయినా రూ.5 లక్షల రైతుభీమా ఇస్తున్నారన్నారు. రైతుబీమా చెక్కుల పంపిణీలో సర్పంచులు, రైతుబంధు కోఆర్డినేటర్స్, వ్యవసాయ విస్తరణ అధికారులు భాగ స్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబిశ్రీనివాస్, ఘనుపూర్(స్టేషన్) మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మండల అధ్యక్షులు పల్లెపాటి జయపాల్‌రెడ్డి, రైతుబంధుసమితి మండల కన్వీనర్ కడారి శంకర్, సర్పంచ్ మంద మల్లేష్, నియోజకవర్గ అధికారప్రతినిది పసునూరి మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు శివయ్య, ఎంపీటీసీలు జ్యోతి రజిత-యాకయ్య, మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజుకుమార్, మండల జాయింట్ సెక్రటరీ పులి ధనుంజరు గౌడ్ , భాస్కర్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మండల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.