Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ తిరుమల్‌రెడ్డి
నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. బుధవారం మహదేవపూర్ మండల పరిధి కాళేశ్వరం మహాదేవపూర్, అంబటిపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. కాళేశ్వరం అంగన్వాడీకేంద్రంలో జీసీసీ రేషన్‌షాప్‌లో లోటుపాట్లున్నాయని, వారికి వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా అధికారిని ఆదేశించారు. కేసీఆర్ కిట్, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వారికి అందించే డబ్బులు సకాలంలో అందించడం లేదని తమ దష్టికి వచ్చిందని తెలిపారు. ఆహార భద్రత పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో 9600పైగా రేషన్ కార్డు లబ్ధిదా రులకు వేలిముద్రలు ఇతర కారణాలతో బియ్యం అందడం లేదని అన్నారు. అంత్యోదయ కార్డుదారులకు నాలుగేండ్లుగా ఎందుకు చక్కర ఇవ్వ ట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 10వేలమంది వరకు సక్రమంగా రేషన్ బియ్యం తీసుకోవడం లేదని, వారు స్వచ్ఛందంగా రేషన్ తీసుకోకూడదని ముందుకు రావాలని కోరారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అంతకుముందు తిరుమల్ రెడ్డికి కాళేశ్వరం హరిత హౌటల్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణిభారు, తాసిల్ధార్ శ్రీనివాస్, ఎంపీటీసీ మమతానాగరాజు కాళేశ్వరం, మహాదేవపూర్ సర్పంచులు వసంతరెడ్డి, శ్రీపతి బాపు, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఎస్సై రాజ్‌కుమార్, జెడ్పీసీఈఓ శోభారాణి డీఆర్డీఓ పురుషోత్తం, ఎంపీఓ ప్రసాద్ పాల్గొన్నారు.