Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఈనెల 22, 23, 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జనగామ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్య కర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందన్నారు. ధనవంతులు మరింత ధనవంతులుగా మారే విధానాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో యువకులకు ఒరిగిందేమీ లేదన్నారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ఇంధన ధరలు సైతం పెంచేసిందన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ ఎరువుల ధరలను భారీగా పెంచేసిందన్నారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్ నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ రాబోయే రోజుల్లో పోరాటాల రూపకల్పనకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, సాంబరాజు, యాదగిరి, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పోత్కనూరి ఉపేందర్, ఎన్నకుస కుమార్, పొదల నాగరాజు, ఎండీ షబానా, జోగు ప్రకాష్, బి చందూనాయక్, మునిగేల రమేష్, చిట్యాల సోమన్న, వెంకటేష్, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.