Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ భిక్షపతి
నవతెలంగాణ-ములుగు
చిన్న జీయర్ స్వామిని అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్ ముంజల భిక్షపతి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని జంగాలపల్లిలో శుక్రవారం నిర్వహించిన యూత్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పంది మాంసం తినేవారు పందిలా, గుడ్డు తినే వారు కోడిలా పెంటలపై ఏరుకు తింటారని, మేక మాంసం తినేవారు మేకలా ఉంటారంటూ హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను హేళన చేస్తూ మాట్లాడిన క్రమంలో చిన్న జీయర్ స్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న జీయర్ స్వామి చిన్న జీయర్ స్వామి ఆలోచనల భాగంగానే సీఎం కేసీఆర్ ములుగు జిల్లాకు సమ్మక-సారక్క నామకరణ చేయలేదని ఆరోపించారు. సమ్మక్క సారక్కల సన్నిధిలో ప్రతిఒక్కరూ మాంసం, బెల్లం, కొబ్బరికాయలతో మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. ఆంధ్ర నుండి వచ్చిన చిన్న జీయర్ స్వామి ఆస్తులు ఎంత అనే విషయమై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. చిన్న జీయర్ స్వామి మాటలు పక్కనపెట్టి ఇకనైనా జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ యూత్ నాయకులు సామర్ల గణేష్, నక్క రాజు, శ్రీను, రమేష్, రవి, సాంబయ్య, సారయ్య, సంజీవ్, దేవేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.