Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
మండలంలోని అంకుషాపూర్, పంగిడిపల్లి, వెలిశాల, గర్మిల్లపల్లి, రాఘవపూర్, ఎంపేడు గ్రామాల్లో ఇటీవల మతి చెందిన మతుల బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు పతనం తప్పదని అన్నారు. ఆయనవెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు నాంపల్లి వీరేశం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కష్ణారెడ్డి, రాజమౌళి, ఐలయ్య, రవి, బోయిన మధుకర్, రెడ్డి రాజుల రాజు తదితరులు పాల్గొన్నారు.