Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సర్పంచ్ నర్సయ్య
నవతెలంగాణ-రాయపర్తి
ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య అన్నారు. శుక్రవారం గ్రామంలో ఆరోగ్యశాఖ సిబ్బందిచే ఫీవర్ సర్వే నిర్వహించారు. కరోనా నియంత్రణ మొదటి టీకా వేసుకున్న వారికి రెండవ టీకా వేయించారు. ఇంటింటికి మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులు కరోనాను నిర్మూలించడానికి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఏఎన్ఎం జయలత, జిపి కార్యదర్శి అశోక్, ఆశ వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.