Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
భూపాలపల్లి జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేట, దమ్మపేట గ్రామాల్లోని పామాయిల్ తోటలను శుక్రవారం మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం, చిన్నతూండ్ల, వలేంకుంట, ఇప్పలపల్లి గ్రామాల రైతులు సందర్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఆర్టీసీ బస్సులో 46 మంది రైతులను తీసుకెళ్లారు. పామాయిల్ తోటల పెంపకం, ఎరువుల వాడకం, సాగు లాభాలు తదితర అంశాలపై రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. హార్టికల్చర్ అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, హెచ్ఓ సునిల్, సువెన్ ఆగ్రో కంపెనీ ఎండీ గౌతంరెడ్డి, ప్రతినిధి రాందాస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.