Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
కాకతీయుల కళా క్షేత్రం శ్రీభవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శుక్రవారం జర్మన్ దేశస్తులు సందర్శించారు. కాకతీయులు నిర్మించిన గణపేశ్వరాలయం మహాద్భుతంగా ఉందని కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన చోల్లేటి సాయి రెడ్డి సతీమణి రూట్‌తోపాటు రెబెకా, లువాని, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. జర్మన్ దేశంలో స్థిరపడ్డ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఏటా ఫిబ్రవరిలో కోటగుళ్లు సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల గోవులకు పండ్లు అందజేశారు. ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారిని సన్మానించారు.