Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
మండలంలోని నాగారం పెద్ద చెరువు తూముకు కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టారు. అలాగే చెరువుకున్న నాలుగు తూముల ద్వారా సాగునీరు వృథాగా పోవడంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వృథాను అరికట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఐబీ అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాగారం పెద్ద చెరువు నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువు తూముకు గండిపెట్టిన, నిబంధనలకు విరుద్ధంగా తూముల ద్వారా నీటిని వదిలిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.