Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ నక్షలో కాలిబాట లేదు : అధికారులు
నవతెలంగాణ-శాయంపేట
తమ వ్యవసాయ భూముల గట్టు పైనుండి నడవడమే కాక, తమపై కక్ష సాధింపు ధోరణితో తోటి రైతులు గొడవలు పడుతున్నారని, గొడవలు సద్దు మనగడానికి తన భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు రైతు నూనె తిరుపతి తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం తోటి రైతు సిరిపురం రాజమౌళితో కలిసి పాల్గొని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు సర్వేనెంబర్ 569/1, 480/ ఈ లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా పొలం గట్లపై నుండి సిరిపురం రాజయ్య, అశోక్ పొలం పనులకు వెళ్లి వచ్చేవాడని తెలిపారు. రైతులు సిరిపురం రాజయ్య, ఏనుగుల అశోక్ కుటుంబ సభ్యుల వల్ల తరచు గొడవలు జరగడంతో మూడు సార్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. గొడవలు లేకుండా ఉండడానికి తన భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు వారి భూముల వద్దకు వెళ్లడానికి ఎస్సారెస్పీ కాలువ పక్కన ఎడ్లబండి వెళ్లే దారి కూడా ఉందని తెలిపారు. కావాలనే కక్షసాధింపు ధోరణితో ప్రభుత్వ నక్ష లో కాలిబాట ఉందని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు కూడా సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు.
నక్షలో కాలిబాట లేదు : హేమా నాయక్, ఆర్ఐ
ప్రభుత్వ నక్షలో కాలిబాట ఉండగా వ్యవసాయ భూమి చుట్టు కంచె వేయడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఫిర్యాదు మేరకు సర్వేయర్ తో సర్వే చేపట్టాం. ప్రభుత్వ నక్షలో కాలిబాట లేదు. గొడవ సద్దుమణిగేలా త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతుల సమక్షంలో సమస్య పరిష్కరిస్తాం.