Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోదా రామకృష్ణ
నవతెలంగాణ-పరకాల
అఖిల భారత సఫాయి మజ్దూర్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పరకాలకు చెందిన సోదా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు అశోక్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ వాల్మీకీ శుక్రవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగం గా పరకాలకు వచ్చిన సందర్భంలో జరిగిన సమావేశంలో నియమించారు. అనంతరం వారిని మున్సిపల్ వైస్ చైర్మెన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మెన్ బండి సారంగపాణి, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మెన్ గందె వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు శనిగరపు రజిని నవీన్‌కుమార్, ఏకు రాజు, మార్క ఉమాదేవి రఘుపతిగౌడ్, కౌన్సిలర్లు సన్మానించారు.