Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ చేయాలని కోరుతూ సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు శుక్రవారం ఆయన తెలిపారు. మండల సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన 11 వడ్ల కొనుగోలు సెంటర్లలలో 1840 మంది రైతులు వడ్ల అమ్ముకోగా ఇప్పటి వరకు 230 మందికి రైతులకు 3,00,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగినదని, మిగిలి మొత్తం రైతులకు సకాలంలో అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో వారిని కలవగ స్పందించి వెంటనే సివిల్ సప్లై ఉన్నత అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించడం జరిగినదని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బిందు పాల్గొన్నారు