Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
సమాజంలోని ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష కోరారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్సీ పరిధిలో చేపట్టిన ఇంటింటా ఫీవర్ సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. కరోనా పాజిటివ్ అయిన వ్యక్తుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా నిర్ధారణ అయిన క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా బాధితులు ఆయా సబ్ సెంటర్లలో ఏఎన్ఎంల వద్ద మెడిసిన్ కిట్ తీసుకోవాలని సూచించారు. కరోనా నిర్ధారణ అయితే 7 రోజులు హోమ్ ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుందని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ కష్ణార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్ నవీన్‌రాజ్, హెచ్ఈఓ గోపీచంద్, పీహెచ్ఎన్ కోమల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.