Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట రైల్వే జంక్షన్, ఎలక్ట్రికల్ లోకోషెడ్, రైల్వే ట్రాక్ పనులతోపాటు యార్డ్, ఉన్నతాధికారుల వసతి గహాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఏకే గుప్తా శుక్రవారం తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్‌ను సందర్శించిన అనంతరం ఆయన ఎలక్ట్రికల్ లోకో షెడ్రను పరిశీలించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, ఈఎల్ఎస్ బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు, ఛైర్మన్ నాయిని సదానందం, సెక్రేటరీ రవీందర్ కార్మికుల సమస్యలపై డీఆర్ఎంకు మెమోరాండం అందజేశారు. షెడ్లో మెషిన్ షాపు ఏర్పాటు చేసి, ఈఎల్ఎస్ షెడ్ రోడ్డును మరమ్మతులు చేయించాలని కోరారు. స్కుటర్ స్టాండ్‌ను పెంచుతూ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి షెడ్ కార్మికుల కోసం కాలనీ ఆవరణలో వాలీబాల్, షెటిల్ కోర్టులు నిర్మించాలని కోరారు. ఈఎల్ఎస్ కాలనీలో డ్రెయినేజీ, ఇతర సమస్యలను డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు.
డీఆర్ఎంతో చీఫ్ విప్ వినరుభాస్కర్ భేటీ
కాజీపేట రైల్వే ట్రాక్ పనుల పరిశీలనకు విచ్చేసిన డీఆర్ఎం గుప్తాతో రైల్వే గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినరు భాస్కర్ భేటీ అయ్యారు. కాజీపేట రైల్వే జంక్షన్ పనులు, పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడారు. కాజీపేట డివిజన్ అభివద్ధికి సహకరించాలని కోరారు. రైల్వే స్టేడియం, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో ఏడీఆర్ఎం సుబ్రహ్మణ్యం, కోర్డినేటర్ కష్ణారెడ్డి, డీఆర్ఓ వాసుచంద్ర, కార్పొరేటర్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.