Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులను, సిబ్బందిని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. హనుమకొండలోని పోచమ్మకుంట యూపీహెచ్సీ పరిధిలోని ఇందిరానగర్, గుడిబండల్, లష్కర్ సింగారం పరిధిలోని గోపాల్పూర్, తదితర ప్రాంతాల్లో చేపట్టిన జ్వర సర్వేను డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవితో కలిసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు అందించారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తదితర లక్షణాలున్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నట్టు, పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా మొదటి, రెండో డోస్ తీసుకొని 9 నెలలు పూర్తయిన 60 ఏండ్లకుపైబడ్డ వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు. అలాగే 15 నుంచి 18 ఏండ్ల వరకు వయస్సు కలిగిన బాలలకు సైతం టీకా వేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సర్వైలేన్స్ అధికారి డాక్టర్ కృష్ణారావు, వైద్యాధికారులు డాక్టర్ విజరుకుమార్, డాక్టర్ రవళి, తదితరులు పాల్గొన్నారు.