Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారక్క మహా జాతర మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జాతరకు ఇప్పట్నుంచే జనం పోటెత్తుతున్నారు. ఓవైపు కరోనా భయం.. మరోవైపు విద్యాసంస్థల కు సెలవుల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరగనుంది.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా నెల రోజుల ముందే భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మేడారం పరిసరాలు ప్రస్తుతం రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. భక్తులందరూ కరోనా నిబంధనాలు పాటిస్తూ దర్శించుకోవాలని వారు కోరుతున్నారు.