Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మార్క సుమలత రజనీ కర్ తెలిపారు. మండలంలోని హౌజ్ బుజుర్గ్ గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లును ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రబియా హుస్సేన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు బాజీ, ఉపసర్పంచ్ లావణ్య బాలకష్ణ, వార్డు సభ్యులు డాక్టర్ హుస్సేన్, నిమ్మల రాజు, స్కూల్ కమిటీ చైర్మెన్ ఇమామ్ పాషా, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాకూబ్, ప్రధాన కార్యదర్శి మహేందర్, కటాక్షపుర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుమన్ పాల్గొన్నారు.