Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
దళితబంధు 118 నియోజకవర్గాల్లో ఇస్తాననడం రాబోయే ఎన్నికల కోసం తప్ప దళితలపై ప్రేమతో కాదని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత బంధు పేరుతో నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడం దళితులను మోసం చేయడమే అన్నారు. దళితులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూడెకరాల భూమి, ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేఝశారు. 2023 ఎన్నికలను దష్టిలో పెట్టుకొని దళిత బంధు రాష్టం మొత్తం అమలు చేస్తూన్నట్టుగా కెసిఆర్ మరొక్క సారి దళితుల ఓటు బ్యాంకును తనవైపుకు తిప్పుకోవడం కోసం పడుతున్న తిప్పలని ఎద్దేవా చేశారు. రైతులకు చేస్తానన్న లక్ష రూపాయల రుణమాఫీ మాటలు నీటి మూటలుగా మారాయని, హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చెడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.