Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని రంగనాధ ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శౄఖ ఆధ్వర్యంలో సర్పంచ్ బీరవెల్లి యాదగిరిరెడ్డితో కలిసి ఆదివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి అశ్విన్ మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారని తెలిపారు. ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా సోకడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నాకుల వాణి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కాసం వెంకటేశ్వరరెడ్డి, వార్డు సభ్యులు గుగులోతు సంతోష్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కందగట్ల వెంకటేశ్వర్లు, నాయకులు పులి రామచంద్ర, సుధాకర్‌రెడ్డి, ఉపేందర్, గుగులోతు బిచ్చనాయక్, తదితరులు పాల్గొన్నారు.