Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమ్ మండల కన్వీనర్ ఠాకుర్ సురేందర్ సింగ్
నవతెలంగాణ-తాడ్వాయి
క్యూ న్యూస్ ఛానల్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయ డం అప్రజాస్వామికమని తీన్మార్ మల్లన్న టీమ్ బ్యాడ్ బారు మండల కన్వీ నర్ సురేందర్ సింగ్ ఠాగూర్ అన్నారు. గతంలో మల్లన్నను అరెస్ట్ చేయ డాన్ని ఖండిస్తూ ఆదివారం తహసీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మల్లన్న టీమ్ జిల్లా కో కన్వీనర్ అచ్చు నూరి కిషన్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాచరిక, నియంత తరహా పాలన సాగిస్తూ ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతోందని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా టీమ్ సభ్యులు తోట అనిల్, నియోజకవర్గ వర్గ సభ్యులు రాసల సురేష్, మండల టీమ్ కోకన్వీనర్ మల్యాల మనోహర్, నలమొక్క రవి, గడ్డం శ్రీకాంత్, మద్దెల మహేష్, తిప్పిన పెల్లి సిద్దు, పెళ్లి సంపత్, పురుషోత్తం నరేష్, తదితరులు పాల్గొన్నారు.