Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని పీచర గ్రామ పరిథిలోని సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ఫిబ్రవరిలో జరగనున్న జాతర నేపథ్యంలో అభివద్ధి, పారిశుద్ధ పనులకు పీచర గ్రామపంచాయతీ పాలకవర్గం ఆదివారం శ్రీకారం చుట్టింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్న క్రమంలో ముందస్తుగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాగునీటి, ఇతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి పారంభం కానున్న మినీ సమ్మక్క సారలమ్మ జాతరకు మండలంలోని ప్రజలందరూ వచ్చి వనదేవతల దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ మేక రవీందర్, ఉపసర్పంచ్ శ్రీధర్‌రెడ్డి, ఆత్మ జిల్లా చైర్మెన్ కీర్తి వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మెన్ ఎర్రగొల్ల ఎల్లయ్య, వైస్ చైర్మెన్ రవీందర్, ఆలయ డైరెక్టర్లు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలు తిరుపతి, మేకల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.