Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా మహిళా అధ్యక్షురాలు నునావత్ రాధ
నవతెలంగాణ-నెల్లికుదురు
కాంగ్రెస్ హయాంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు నూనావత్ రాధ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మెన్ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి, రతిరాంతండా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె ఆదివారం కలిసి పరామర్శించారు. అనంతరం పీఏసీఎస్ డైరెక్టర్ గుగులోతు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాధ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. స్వరాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని చెప్పారు. భవిష్యత్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రతిరాంతండాలో వివిధ పార్టీల నుంచి సుమారు 50 మంది పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధికార ప్రతినిధి కుమ్మరికుంట్ల మౌనేందర్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు తూళ్ల ప్రణరు, మల్లేశం, సుధాకర్, కిషన్, సురేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.