Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
టీఆర్ఎస్ సభ్యత్వం పొంది ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం భీమా చెక్కులను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన గుంజ లక్ష్మయ్య, మల్లూరు గ్రామానికి చెందిన సాయిని రాంబాబు కుటుంబాలకు మంజూరైన రూ.2 లక్షలు చొప్పున చెక్కులు బాధిత కుటుంబాలకు అందించారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలీయాబీ, సొసైటీ చైర్మెన్ తోట రమేష్, సీనియర్ నాయకులు పోరిక గోవిందానాయక్, తుమ్మ మల్లారెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు, మాజీ జెడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం, గుండేటి రాజుయాదవ్, సొసైటీ డైరెక్టర్లు డేగల ఆదినారాయణ, సింగరబోయిన నర్సయ్య, నర్రా శ్రీధర్, సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, చిట్టిమల్ల రజిత సమ్మయ్య, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.