Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కారుపోతుల చంద్రమౌళి గౌడ్ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి నివాళ్లర్పించి మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నేతాజీ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమం లో నాయకులు నల్లాని పాపారావు, వెళ్లికూచి నాగయ్య శాస్త్రి, బైరు రవి, పంజాల దేవరాజు, ఆంగోతు యాకన్న, మహమ్మద్ ముస్తఫా, ముత్యాల సురేష్, జాటోత్ యుగేందర్, రాగుల రాజేష్, రావిరాల గ్రామ కమిటీ అధ్యక్షుడు రాస యాకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.