Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
శరత్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి కోరారు. హనుమకొండలోని పోచమ్మకుంట లోని పోచమ్మ ఆలయ ఆవరణలో శరత్ కంటి ఆస్పత్రి యాజమాన్య సహకారంతో ఆ పార్టీ గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిభిరాన్ని ఆదివారం రాజేందర్రెడ్డి ముఖ్యఅతిథి గా హాజరై ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయించడం అభినందనీయ మని చెప్పారు. ఈ సందర్భంగా పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, మాజీ డివిజన్ అద్యక్షుడు సత్యనారాయణ, నాయకులు పున్నంచందర్, పెద్ద రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.