Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
నియోజకవర్గ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన్ను పర్వతగిరిలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే బహుకరించారు. తనపై అభిమానాన్ని చూపిన యూత్ నాయకులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజల ఆదరాభిమానాలను కాపాడుకుంటూ ప్రజాసేవలో నిమగమవు తానని స్పష్టం చేశారు. కోవిడ్ విపత్కర సమయంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, ఆర్థిక చేయూత అందించామని చెప్పారు. సేవలే తనకు శ్రీరామరక్షగా మారాయని అన్నారు.. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తొర్రూరు, పాలకుర్తిలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. మంత్రిని కలిసిన వారిలో మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మంగళపల్లి వినరు కుమార్, ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్షుడు దొంగరి ఉపేందర్, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు వేల్పుకొండ రమేష్, నాయకులు గూడెల్లి శేఖర్ నకిరెకంటి సంపత్ ఉన్నారు.