Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులపై మంత్రి చర్చించారు. పెండింగ్ అంశాలు, నడుస్తున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధి పనులను అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో రూ.49.62 కోట్ల వ్యయంతో రోడ్లు మంజూరైనట్టు తెలిపారు. అలాగే మండలానికి రూ.3.88 కోట్ల వ్యయంతో ఈజీఎస్ ద్వారా 52 పనులను చేపట్టామన్నారు. ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ మండలానికి మంజూరైన ఈజీఎస్ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్‌లను, ప్రజాప్రతినిధులను కోరారు. సమావేశంలో డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్రావు, జెడ్పీ వైస్ చైర్మెన్ గజ్జల శ్రీరాములు, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ వెంకటరమణ, పీఆర్, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ డీఈలు దయాకరాచారి, జీవన్, సురేష్, శారద, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి పూజలు
మంత్రి దయాకర్‌రావు శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పుర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి వారి శేష వస్త్రములు, ప్రసాదం అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మెన్ రవీందర్రావు, ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, పునరుద్ధరణ కమిటీ చైర్మెన్ మునిగాల సంపత్‌కుమార్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, గట్టు పురుషోత్తమ శర్మ, మధు శర్మ, భాను ప్రసాద్ శర్మ, నరేష్ శర్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు.