Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క డిమాడండ్ చేశారు. జిల్లా పేరు కోసం తలపెట్టిన పాదయాత్ర, దీక్ష కరపత్రాన్ని జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో సీతక్క ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సాధన ఉద్య మం కూడా సమ్మక-సారక్క నామకరణం పేరుతోనే కొనసాగుతున్నట్టు తెలి పారు. ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన సీఎం కేసీఆర్ ములుగుకు వనదేవ తల పేర్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గద్వాలకు జోగులాంబ, భువన గిరికి యాదాద్రి, సిరిసిల్లకు వేములవాడ రాజన్న, కొత్తగూడెంకు భద్రాద్రి జిల్లాలు గా పేర్లు పెట్టి ములుగు పట్ల వివక్ష పాటించడం సరికాదన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమం ఉధతం చేస్తామని చెప్పారు. భిక్షపతి జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం కోసం అనేక ఏండ్లు గా ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత జాతరలోగా జిల్లాకు సమ్మక్క సారక్కగా నామకరణం చేయాలని, మల్లంపల్లి మండలంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, వైటీసీ భవన్లో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.