Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ఫీవర్ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించా లని జిల్లా కలెక్టర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శశాంక కోరారు. మండలంలోని చెర్లపాలెంలో చేపట్టిన ఫీవర్ సర్వేను సోమవారం ఆయన పరి శీలించారు. తొలుత మున్సిపల్ కేంద్రంలో, అనంతరం చెర్లపాలెంలో ఆయన పర్యటించి ప్రజలను కలిసి మాట్లాడారు. కరోనా ఉధృతి కొనసాగుతన్న క్రమంలో ప్రభుత్వం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. వాతావరణం లో మార్పులు, కరోనా వ్యాప్తి వల్ల పలువురిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయట పడు తున్నాయని చెప్పారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వచ్చినప్పుడు వివరాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. మొదటి డోస్ 103 శాతం పూర్తి చేయగా రెండో డోస్ 77 శాతం పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు పాటించాలని, మాస్కు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ హరిప్రసాద్, కౌన్సిలర్లు భూసాని రాము, గజానంద్, గుగులోతు శంకర్, ఎన్నమనేని శ్రీనివాసరావు, కొలుపుల శంకర్, చెర్లపాలెం సర్పంచ్ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.