Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
రైతులకు అందుబాటులో ఉండేలా రైతు ఆగ్రోస్ కేంద్రాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీపీ జయశ్రీ, జెడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల ఉపాధ్యక్షుడు జెగ్గం ఆనంద్ కుమారుడు దేవా ఆగ్రోస్ సెంటర్‌ను జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డితో కలిసి ఎంపీపీ ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్, పార్టీ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్, నియోజకవర్గ వర్క్స్ కమిటీ చైర్మెన్ బొల్లంపల్లి నాగేందర్, పీఏసీఎస్ చైర్మెన్ మల్గ శ్రీశైలం, మండల అధికార ప్రతినిధి బోయిని రాజు, దిశా కమిటీ సభ్యులు ఉడ్గుల భాగ్య, సర్పంచ్ సాదం విజరుమనోహర్, నర్సింగరామకృష్ణ, గండి యాదగిరి , మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.