Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని నాగరాజుపల్లి గ్రామంలో ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో జరగనున్న మద్ది మేడారం జాతర ఏర్పాట్లను పూర్తి చేయాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునితప్రవీణ్గౌడ్ అన్నారు. సోమవారం సంబంధిత పనులను ఆమె పరిశీలించి అన్ని శాఖల వారితో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, పారిశుధ్య పనులు, దారి మరమ్మతులు, సందర్శకులకు సౌకర్యాల కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, కరోనా నిబంధనలను పాటిస్తూ జాతర మహౌత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్ది మేడారం దేవాలయ కమిటీ చైర్మెన్ చిట్యాల సీతారాం రెడ్డి, తహసీల్ధార్ దూలం మంజుల, ఎంపీడీఓ విజరుకుమార్, నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్, సర్పంచ్ గోనెల శ్రీదేవి, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.