Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
యువత స్వయం ఉపాధిపై దృష్టిపెట్టాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ డి రఘుచందర్ అన్నారు. సోమవారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను నిర్వాహకులు జార్జిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే వారికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, జాలిగం రాజ్ కుమార్, వక్కల రాజు పాల్గొన్నారు.