Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మానవ మనుగడకు ఆడపిల్ల మూలమని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ-గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డి కిషన్ అన్నారు. సోమవారం స్థానిక క్రాంతి మండల సమైఖ్య ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోం దన్నారు. బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై తల్లిదండ్రులకు, వీవోఏ లకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. బాలికల హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్ష రూపుమా పడానికి, మహిళా సాధికారతకు పోరాటాలు చేయాలని, ఇందుకు విద్యే ఏకైక మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు బొజ్జ సురేశ్, సదరం రాజయ్య, గుండెటి కుమార స్వామి, గుండెటి ఏలియా, కృష్ణమూర్తి, స్వరూప, క్రాంతి, సుజాత, కృష్ణ, అధ్యక్షురాలు కళ్యాణి, కార్యదర్శి రాజమణి, కోశాధికారి రేణుక, తదితరులు పాల్గొన్నారు.