Authorization
Mon Jan 19, 2015 06:51 pm
22వ వార్డు కౌన్సిలర్ రవీందర్‌గౌడ్
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణ ప్రజలందరూ నిత్యం మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని 22వ వార్డు కౌన్సిలర్ ముంజల రవీందర్ గౌడ్ సూచించారు. సోమవారం కౌన్సిలర్ ఆధ్వర్యంలో 22 వార్డు లక్ష్మీ నగర్ హనుమాన్‌నగర్‌లో ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారికి తగు జాగ్రత్తలు సూచించారు. మాస్కులు తప్పకుండా ధరించాలని, జ్వరం జలుబు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలన్నారు. అనంతరం మెడిసిన్ కిట్లు పంపిణీ చేశారు. ఏఎన్ఎం సరోజన, ఆశవర్కర్లు రజిత, స్వాతి పాల్గొన్నారు