Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
అర్హులైన ప్రతి భూ నిర్వహసితునికి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పిస్తామని భూపాలపల్లి ఆర్డిఓ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల పంచా యతీ కార్యాలయ ఆవరణలో కాపురం, తాడిచెర్ల ఎస్సీకాలనీ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ముందుగా నిర్వాసితులు మాట్లాడుతూ... పదేండ్ల కిందట ఓసీపీ బ్లాక్-1లో ఇండ్లు కోల్పోయిన పరిహారం పొంది ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం అందని అర్హులైన జాబితాను వెల్లడించారన్నారు. జాబితా ప్రకటించిన వెంటనే కొందరు నిర్వాసితులు ఆందోళనకు గురయ్యామన్నారు. జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదారేండ్లుగా రెవెన్యూశాఖ అధికారులు ప్రకటించిన రెండు మూడు జాబితాల్లో తమ పేర్లు ఉండి చివరి జాబితాలో పేర్లు తొలగిం చడంపై అయోమయానికి గురయ్యామనానరు. పేర్లు మిస్సైన అర్హులు (స్థానికంగా రేషన్,ఆధార్) కార్డులు ఉన్నవారు భూపాలపల్లి ఆర్డిఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డిఓ సూచించారు. జాబితా ప్రకటించిన నిర్వహసితులకు త్వరలోనే ఆర్అండ్ ప్యాకేజీ, పునరావాసం కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలహల్రావు, ఎంపీటీసీ కల్పన, తహసీల్ధార్ శ్రీనివాస్, ఆర్ఐ సరిత, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.