Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బాలకృష్ణ
నవతెలంగాణ-వర్ధన్నపేట
జీవాలకు ప్రభుత్వం అందజేసే ఉచిత టీకాలను పెంపకందారులు వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జేడీ డాక్టర్ బాలకృష్ణ అన్నారు. సోమవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని యాదవ కాలనీలో గొర్రెలకు పీపీఆర్ వ్యాక్సిన్ కార్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం వర్ధన్నపేట అధ్యక్షులు కందుగుల నర్సయ్య యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ జలంధర్‌రెడ్డి, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మంచాల రామకృష్ణ్ణ, రాజశేఖర్, చందు సాయిలు, దొంగల రమేష్్, ఎస్రమేష్, మండల పశువైద్యాధికారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.