Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మండలం గట్టుమల్లు
నవతెలంగాణ-జఫర్గడ్
వ్యవసాయ కార్మికుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మండలం గట్టుమల్లు కోరారు. సోమవారం మండల కేంద్రంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్ధార్ స్వప్నకు అందజేసి ఆయన మాట్లాడారు. 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు రైతుబంధు పథకం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీలో సామాజిక వర్గీకరణ విరమించుకొని వంద రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600 ఇచ్చేలా వేతనం షెడ్యూల్ చట్టాలను సవరించాన్నారు. కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఐ జిల్లా నాయకులు జువారి రమేష్, యాకూబ్ పాషా పాల్గొన్నారు.